“సలార్” ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ రూమర్స్

“సలార్” ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ రూమర్స్

Published on Dec 26, 2023 10:05 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం “సలార్” తో ఫైనల్ గా తన కెరీర్ లో మరి మాసివ్ హిట్ ని తాను అందుకోగా ఇప్పుడు ఫ్యాన్స్ అంతా సలార్ మాస్ మేనియా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మరి థియేటర్స్ లో దర్శకుడు ప్రభాస్ లు చూపించిన విధ్వంసం సాలిడ్ ఎక్స్ పీరియెన్స్ ని కూడా అందించగా ఈ వైబ్స్ లో రెబల్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఈ క్రమంలో సలార్ ఓటిటి రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ రూమర్స్ కొన్ని వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధర ఇచ్చి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ చిత్రం రానున్న ఫిబ్రవరి మొదటి వారంలో అయితే స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సో సలార్ ఓటిటి రిలీజ్ కోసం చూసేవాళ్ళు అప్పటివరకు లేదా ఆ తర్వాత వరకు ఆగాల్సిందే అని చెప్పాలి. మరి దీనిపై రానున్న రోజుల్లో మరింత క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు