లేటెస్ట్ : “సైంధవ్” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది..ఈ రెండు భాషల్లో స్ట్రీమింగ్

లేటెస్ట్ : “సైంధవ్” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది..ఈ రెండు భాషల్లో స్ట్రీమింగ్

Published on Jan 31, 2024 12:19 PM IST


మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా “సైంధవ్”. అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో అంచనాలు అందుకోలేకపోయింది. సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రాల్లో అయితే ఈ ఒక్క చిత్రమే ప్లాప్ గా నిలువగా ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసేసుకుంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం అఫీషియల్ గా ఈ ఫిబ్రవరి 3 నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇందులో ఈ చిత్రం ఒరిజినల్ తెలుగు సహా తమిళ్ డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా లాక్ అయ్యింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకున్నవారు అప్పుడు వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు