నాగార్జున “ది ఘోస్ట్” దుబాయ్ షెడ్యూల్‌ పూర్తి!

Published on Mar 30, 2022 7:39 pm IST

ఈ సంవత్సరం బంగార్రాజు చిత్రం తో భారీ విజయాన్ని అందుకున్న నాగార్జున అక్కినేని, తదుపరి యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్‌లో కనిపించనున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాలి చౌహాన్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇప్పుడు తాజాగా దుబాయ్‌లో చిత్ర బృందం ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ షెడ్యూల్‌లో లీడ్‌ పెయిర్‌తో కూడిన మేజర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, రొమాంటిక్‌ సాంగ్‌ని చిత్రీకరించిన సంగతి తెలిసిందే. టీమ్ హైదరాబాద్ చేరుకుని త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభించనుంది. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. భరత్ సౌరభ్ ద్వయం సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2022లో థియేటర్లలోకి రానుంది.

సంబంధిత సమాచారం :