“అంటే సుందరానికి” నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ కి రెడీ

Published on May 6, 2022 2:06 pm IST

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నజ్రియా ఫహద్ నటించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లోని రెండవ పాటను మే 9, 2022 న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అనౌన్స్‌మెంట్ పోస్టర్ పాజిటివ్ వైబ్‌లను ఇస్తుంది మరియు వివేక్ సాగర్ కంపోజ్ చేసిన రొమాంటిక్ ట్రాక్‌గా అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, నికేష్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా ఈ చిత్రం జూన్ 10, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :