విజయ్ – వంశీ పైడిపల్లి సినిమా లేటెస్ట్ అప్డేట్!

Published on May 2, 2022 7:12 pm IST


స్టార్ హీరో విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈద్ బ్రేక్ పూర్తి కాగానే మరికొద్ది రోజుల్లో రష్మిక కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పవర్ ఫుల్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం విజయ్‌కి భారీ పారితోషికం లభించింది. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :