బాలయ్య “అఖండ” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Sep 11, 2021 9:10 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. మాస్ లో విపరీతమైన అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం రిలీజ్ కోసం కొత్త అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ప్రస్తుతం లాస్ట్ షూట్ లో బిజీగా ఈ షూట్ పై తాజా అప్డేట్ వినిపిస్తుంది. మరి దీని ప్రకారం “అఖండ” లేటెస్ట్ షెడ్యూల్ షూట్ గోవా లో స్టార్ట్ కానుందట. ఈ వచ్చే 13 నుంచి మూడు రోజులు కొనసాగనున్నట్టు తెలుస్తుంది. మరి మరోపక్క ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు.

మరి అదెప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :