‘హంసా నందిని’ హెల్త్ కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jan 24, 2022 7:38 pm IST

హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ గర్ల్ గా పలు చిత్రాల్లో నటించి అలరించిన ‘హంసా నందిని’ ప్రస్తుతం క్యాన్సర్‌ తో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్‌ గ్రేడ్-3తో బాధపడుతుంది. కాగా ‘హంస నందిని’ హెల్త్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ఆమెకు కీమో థెరపీ చికిత్స పూర్తి అయిందని తెలుస్తోంది. ఆమె క్యాన్సర్ నుంచి వేగంగానే కోలుకుంటుంది.

ఇక ఆమె గతంలో తనకు క్యాన్సర్ అని మెసేజ్ ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేస్తూ.. క్యాన్సర్ తో పోరాడుతున్నానని, కీమోథెరపీ కారణంగా జుట్టు మొత్తం కోల్పోయానని చెప్పుకొచ్చింది. ఆమె అలా చెప్పడం నెటిజన్లను కదిలించింది. అలాగే ఆమె షేర్ చేసిన ఫొటోలో పూర్తి గుండుతో కనిపించింది. అసలు ఈ క్యాన్సర్ గురించి ఆమెకు ఎప్పుడు తెలిసింది అంటే.. తన బ్రెస్ట్ లో లంప్ ఉన్నట్లుగా హంసానందిని గుర్తించిందట. వెంటనే వెళ్లి డాక్టర్స్ ని సంప్రదించింది. పలు టెస్ట్ లు చేయించుకున్న తర్వాత ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది.

సంబంధిత సమాచారం :