“మేజర్” ట్రైలర్ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on May 3, 2022 4:55 pm IST


యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు శశికిరణ్ తిక్క నటిస్తున్న సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “మేజర్” కూడా ఒకటి. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. మరి ఈ అనౌన్సమెంట్ ని రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు. మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం ట్రైలర్ కట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా శ్రీచరణ్ పాకల సంగీతం అందించాడు. అలాగే సోనీ పిక్చర్స్ మరియు మహేష్ బాబు బ్యానర్ లపై ఈ సినిమా నిర్మించబడింది.

సంబంధిత సమాచారం :