శంకర్, చరణ్ ల సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Nov 12, 2021 11:07 am IST


ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఐకానిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే గత కొన్ని రోజులు కితమే సినిమా కీలక ఫస్ట్ షెడ్యూల్ ని శంకర్ కంప్లీట్ చేసేసారు. ఇందులోనే ఒక సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా ప్లాన్ చేసిన శంకర్ ఇపుడు సినిమా రెండో షెడ్యూల్ కి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం శంకర్ ఈ నవంబర్ 15 నుంచి ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారట. అలాగే ఇది హైదరాబాద్ లోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాపై మాత్రం నెక్స్ట్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే శంకర్ సాలిడ్ కం బ్యాక్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ చిత్రంలో కియారా హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం ఇస్తున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More