“వాల్తేరు వీరయ్య” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Dec 8, 2022 12:00 pm IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. మరి నిన్ననే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు మిగిలి ఉన్న షూటింగ్ ని అయితే శరవేగంగా కంప్లీట్ చేసుకుంటుంది. మరి ఇప్పుడు అయితే సినిమా షూటింగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలుస్తుంది.

సినిమాలో ఇంకా రెండు సాంగ్స్ బ్యాలన్స్ ఉండగా వాటిని అయితే మేకర్స్ ఈ రెండు వారాల్లో పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సాంగ్స్ షూట్ అంతా ఫారిన్ కంట్రీస్ లోనే ఉండగా మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే వచ్చే ఏడాది జనవరి 13 నాటికి వాల్తేరు వీరయ్య తన లంగరుతో బాక్సాఫీస్ వేటకు రెడీ అయిపోతున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :