తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన “లియో”

తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన “లియో”

Published on Nov 24, 2023 3:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ లియో. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా నేటి నుండి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

తమిళ భాషలో మాత్రమే కాకుండా, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ లు కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ రవి చందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు