యూట్యూబ్ లో దూసుకెళ్తున్న లైగర్ ‘అక్డి పక్డి’ సాంగ్

Published on Jul 11, 2022 10:32 pm IST

విజయ్ దేవరకొండ, అనన్య పాండే కలయికలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్. విజయ్ ఈ మూవీలో కిక్ బాక్సర్ గా నటిస్తుండగా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, విజయ్ కి తల్లిగా నటిస్తున్న ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే మూవీ నుండి పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేసిన టీమ్, నేడు ఫస్ట్ సాంగ్ అక్డి పక్డి ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.

నిన్న రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో అదగొట్టగా, నేడు రిలీజ్ అయిన ఫుల్ లిరికల్ వీడియో కూడా దుమ్మురేపుతోంది. మాస్ బీట్ తో సాగే ఈ సాంగ్ ని గాయకులు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఇద్దరూ కూడా ఎంతో అద్భుతంగా పాడగా, విజయ్ అనన్య ఇద్దరూ కూడా మాస్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యువత, మాస్ ఆడియన్స్ ఈ సాంగ్ కి ఎంతో కనెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ ఐదు భాషల్లో కలిపి 4 మిలియన్ వ్యూస్, 275కె లైక్స్ తో దూసుకెళుతోంది. కాగా ఈ మూవీ ఆగష్టు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :