మాస్ స్టెప్పులేస్తున్న విజయ్…లైగర్ పై పెరుగుతున్న అంచనాలు!

మాస్ స్టెప్పులేస్తున్న విజయ్…లైగర్ పై పెరుగుతున్న అంచనాలు!

Published on Oct 25, 2021 2:00 PM IST

విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో యూత్ ఐకాన్ గా మారిపోయారు. అర్జున్ రెడ్డి చిత్రం తో యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్, వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రం లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు, అభిమానులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్స్ ను తరచూ షేర్ చేస్తున్నారు నటి, నిర్మాత ఛార్మి కౌర్. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటో ను షేర్ చేయడం జరిగింది. మాస్ గెటప్ తో ఉన్నటువంటి విజయ్ చేతి ఫోటోను పంచుకున్నారు.అంతేకాక ఈ చిత్రం లో విజయ్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ స్టెప్పులు వేస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సాంగ్ షూటింగు జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాస్ సాంగ్ కి చోటు ఉండటం తో ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫోటో ను షేర్ చేయడం తో విజయ్ గెటప్ కూడా ఇంకో రేంజ్ లో ఉంటుంది అంటూ కొందరు చెప్పుకొచ్చారు. బాలీవుడ్ భామ అనన్య పాండే ఈ చిత్రం లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు