తమిళనాడులో ‘బాహుబలి’ విడుదలకు లైన్ క్లియర్ !
Published on Apr 19, 2017 4:51 pm IST


‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం పట్ల తెలుగుతో పాటు తమిళంలో కూడా భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా విడుదలకానన్ని థియేటర్లలో బాహుబలి తమిళనాడులో విడుదలవుతోంది. భారీ డిమాండ్ ఉన్న ఈ చిత్ర యొక్క తమిళ హక్కుల్ని ప్రముఖ నిర్మాత సంస్థ ‘శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్’ భారీ మొత్తాన్ని వెచ్చించి దక్కించుకుంది. కానీ ఆ సంస్థకు బయటి వ్యక్తులతో ఉన్న ఆర్ధిక లావాదేవీ కారణంగా వాళ్ళు ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

అంతేగాక కోర్టులో కేసు కూడా వేశారు. అక్కడ కేసు విచారణకు రాగా ఇరు పార్టీలు స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలనే నిర్ణయానికొచ్చాయి. తమిళ చిత్ర నిర్మాతల మండలి కూడా ఈ సమస్య పరిష్కారంలో చొరవ చూపంచింది. దీంతో తమిళనాట ‘బాహుబలి’ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఏప్రిల్ 28న చిత్రం అన్ని భాషలతో పాటు తమిళంలో కూడా ప్లాన్ ప్రకారం రిలీజవుతుంది.

 
Like us on Facebook