లాక్ డౌన్ రివ్యూ: మాయావన్ తమిళ చిత్రం(అమెజాన్ ప్రైమ్)

లాక్ డౌన్ రివ్యూ: మాయావన్ తమిళ చిత్రం(అమెజాన్ ప్రైమ్)

Published on May 14, 2020 3:19 PM IST

తారాగణం: సుందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ.

దర్శకత్వం: సి.వి.కుమార్

సినిమాటోగ్రఫీ : గోపి అమర్‌నాథ్

మ్యూజిక్: ఘిబ్రాన్

ఎడిటర్: లియో జాన్ పాల్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో మన నెక్స్ట్ మూవీ తమిళ భాషలలో విడుదలైన మాయావన్. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

ఓ చిన్న కేసును ఛేదిస్తూ వెళుతున్న ఇన్స్పెక్టర్ కుమరన్( సందీప్ కిషన్) ఓ దారుణ హత్య గురించి తెలుసుకుంటాడు. ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కుమరన్ తీవ్ర గాయాలపాలవుతాడు. కోలుకున్న కుమరన్ తన టీమ్ సహాయంతో అదే పంథాలో మర్డర్స్ జరుగుతున్నాయని కనుక్కుంటాడు. సీరియస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కుమరన్ ఆ హత్యల వెనకున్న క్రిమినల్ ని పట్టుకున్నారా? ఆ మర్డర్స్ చేస్తుంది ఎవరు? వారి కథ కుమరన్ ఎలా ముగించాడు? అనేది మిగతా కథ…

 

ఏమి బాగుంది?

అగ్రెస్సివ్ పోలీస్ ఆఫీసర్ గా సందీప్ కిషన్ నటన పతాక స్థాయిలో ఉంది. హై ఇంటెన్స్ తో సాగే సన్నివేశాలలో సీరియస్ పోలీస్ గా సందీప్ పాత్రలో జీవించారు. ఆయన డైలాగ్ డెలివరీ మరియు బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంది. ఇక సినిమా క్లైమాక్స్ చిత్రీకరించిన విధానం బాగుంది.

చివరి వరకు కొనసాగే సస్పెన్సు ప్రేక్షకుడికి మంచి థ్రిల్ పంచుతుంది. క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టు లో సైన్స్ ఫిక్షన్ జోడించి తెరక్కెక్కించిన తీరు బాగుంది. ముఖ్యంగా ఆసక్తిని రేపుతూ వేగంగా సాగే సెకండ్ హాఫ్ మంచి అనుభూతిని పంచుతుంది. ఇక లావణ్య త్రిపాఠి పాత్రకు పెద్ద స్కోప్ లేకున్నప్పటికీ పాత్ర పరిధిలో చక్కగా నటించింది.

 

ఏమి బాగోలేదు?

రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ మూవీ అంతగా ఎక్కక పోవచ్చు. అలాగే పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్, ఎమోషన్స్ ఇంకొంచెం దట్టించాల్సింది. మెల్లగా సాగే ఫస్ట్ హాఫ్ మరొక మైనస్ పాయింట్

 

చివరి మాటగా

మొత్తంగా చెప్పాలంటే మాయావన్ ఆద్యంతం ఆసక్తిగా సాగే ఓ చక్కని క్రైమ్ థ్రిల్లర్. ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఆసక్తి గొలిపే మలుపులు, ఆకట్టుకొనేలా తెరకెక్కించిన క్లైమాక్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతాయి. ఇక సీరియస్ పోలీస్ గా సందీప్ కిషన్ నటన మరొక ఆకర్షణ. కొంచెం నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్, కథలో కాంప్లెక్సిటీ మైనస్ పాయింట్స్. అయినటప్పటికి ఈ చిత్రం మంచి థ్రిల్ పంచుతుంది అనడంలో సందేహం లేదు.

123telugu.com Rating : 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు