వేలంటైన్స్ డే కానుకగా ‘లవ్ స్టేట్స్’ ఆడియో రిలీజ్
Published on Jan 26, 2015 8:05 pm IST

Love-States-(9)
ఈ మధ్య కొంతమంది స్మాల్ ఫిల్మ్ మేకర్స్ పేరున్న హెఒలథొ సినిమాలతో చేయడం కంటే కథా బలం ఉన్న సినిమాలను చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. హెజన్ ఎంటర్టైన్మెంట్ – స్నేహ మీడియా బ్యానర్ పై ‘బూచమ్మ బూచోడు’ సినిమాని అందించిన ప్రసాద్ రెడ్డి అన్విత ఆర్ట్ క్రియేషన్స్ తో కలిసి నిర్మించిన రెండవ సినిమా ‘లవ్ స్టేట్స్’. ఈ సినిమా టైటిల్ లోగోని ఈ రోజు ఉదయం లాంచ్ చేసారు. ఉపేన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అంబిక సోని, తానియా శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా ఆడియోని వేలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ‘మా బ్యానర్ లో వస్తున్నా రెండవ సినిమా ‘లవ్ స్టేట్స్’. గతంలో వచ్చిన 2 స్టేట్స్ సినిమా సౌత్ ని నార్త్ ని కలిపింది. మేము ఈ సినిమాలో ఈస్ట్ ని వెస్ట్ ని కలిపాము. అంతే కాకుండా ఓ చిన్న ట్విస్ట్ పెట్టి దీన్ని ట్రై యాంగిల్ లవ్ స్టొరీ చేసాం. కచ్చితంగా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపాడు. ఈ ట్రై యాంగిల్ లవ్ స్టొరీ ద్వారా శ్రవణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook