“లవ్ స్టోరీ” మ్యాజికల్ సక్సెస్ మీట్… ముఖ్య అతిధులుగా నాగార్జున, సుకుమార్!

Published on Sep 28, 2021 9:11 am IST

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం సాధించిన విజయానికి గానూ చిత్ర యూనిట్ లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో ఈ మ్యాజికల్ సక్సెస్ మీట్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధులుగా నాగార్జున అక్కినేని మరియు ప్రముఖ దర్శకుడు సుకుమార్ హాజరు కానున్నారు.

లవ్ స్టోరీ చిత్రం విడుదల అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, యూ ఎస్ లో సైతం ఈ చిత్రం వన్ మిలియన్ మార్క్ ను టచ్ చేయడం జరిగింది. పవన్ సి హెచ్ సంగీతం అందించిన ఈ చిత్రం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు, అభిమానులు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ దాస్ కే నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు లు నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :