“లవ్ స్టోరీ” 5 రోజుల కలెక్షన్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

“లవ్ స్టోరీ” 5 రోజుల కలెక్షన్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

Published on Sep 30, 2021 6:57 AM IST


నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “లవ్ స్టోరీ” సినిమా సెప్టెంబర్‌ 24న రిలీజై మంచి సక్సెస్‌ని అందుకుంది. పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ను రాబడుతోంది. తాజాగా ‘లవ్ స్టోరీ’ సినిమా 5 రోజుల కలెక్షన్స్ వివరాలు వచ్చాయి. ఈ సినిమా ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాక్సాఫీస్ ల వద్ద ఇప్పటి వరకూ రూ. 21.18 కోట్ల షేర్లను సాధించినట్టు తెలుస్తుంది.

5 డేస్ కలెక్షన్ రిపోర్ట్:

నిజాం – రూ.10.08 కోట్లు
సీడెడ్ – రూ.3.32 కోట్లు
ఈస్ట్ – రూ.1.29 కోట్లు
వెస్ట్ – రూ.1.09 కోట్లు
గుంటూరు – రూ.1.29 కోట్లు
కృష్ణా – రూ.1.08 కోట్లు
నెల్లూరు – రూ 0.68 లక్షలు
యూఎస్ – రూ.2.35 కోట్లు

లవ్ స్టోరీ 5 రోజుల కలెక్షన్లు ఏపీ, తెలంగాణ కలిపి రూ. 21.18 కోట్ల షేర్లు (రూ.34.38 కోట్లు) రాగా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.26.66 కోట్ల షేర్లు, రూ. 46.80 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు