“వీరసింహారెడ్డి” నుండి మా బావ మనోభావాలు సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్!

“వీరసింహారెడ్డి” నుండి మా బావ మనోభావాలు సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Dec 21, 2022 11:07 AM IST

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ వీర సింహారెడ్డిలో మాస్ గాడ్, నటసింహ నందమూరి బాలకృష్ణ మునుపెన్నడూ చూడని మాస్ మరియు యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన రెండు సింగిల్స్ జై బాలయ్య, సుగుణ సుందరి స్మాషింగ్ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా సుగుణ సుందరి బాలకృష్ణ అసాధారణమైన డ్యాన్స్‌లతో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఇప్పుడు, ఆల్బమ్ యొక్క స్పెషల్ సాంగ్ కి సమయం వచ్చింది. మేకర్స్ ఇప్పటికే ది సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అని పిలవడం ద్వారా థమన్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇచ్చారు అనేది హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో బాలకృష్ణ బ్లాక్ బ్లేజర్ మరియు కూల్ సన్ గ్లాసెస్‌లో అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ పాటకు చమత్కారమైన పేరు పెట్టారు. మా బావ మనోభావాలు లో బాలయ్య రాకింగ్‌గా ఉన్నాడు. పోస్టర్ తోనే అంచనాల గ్రాఫ్ దూసుకుపోతుంది.

దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మిస్తుండగా, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని, నేషనల్ అవార్డ్ విన్నింగ్ క్రాఫ్ట్‌మ్యాన్ నవీన్ నూలి ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. చందు రావిపాటి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. రామ్ – లక్ష్మణ్ ద్వయం మరియు వెంకట్ ఫైట్ మాస్టర్స్. చిత్ర బృందం చివరి పాటను క్యానింగ్ చేయడంతో త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు