‘మా’ ఎన్నికల్లో అనసూయ, శివారెడ్డి విజయం !

Published on Oct 10, 2021 7:44 pm IST

‘మా’ ఎన్నికల పోలింగ్ విషయంలో రికార్డు స్థాయిలో ఓట్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు మా చరిత్రలోనే ఈ స్థాయి పోలింగ్ జరగలేదు. ప్రస్తుతం మా ఎన్నికల ఫలితాలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి నలుగురు ఈసీ మెంబర్స్‌ గెలుపొందారు. తొలి రౌండ్‌ లెక్కింపులో శివారెడ్డి, అనసూయ, సురేశ్‌ కొండేటి, కౌశిక్‌ గెలుపొందారు. వీళ్ళు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ మెంబర్స్.

అయితే, మంచు విష్ణు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో ముందంజలో ఉండగా, ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ తొలి విజయాన్ని అందుకుంది. అయితే, ఇప్పటి ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి నలుగురు ఈసీ మెంబర్లు గెలుపొందినా.. మిగిలిన మెంబర్ల విషయంలో మాత్రం మంచు విష్ణు ప్యానెల్ కి సంబంధించిన వాళ్లే ముందజలో ఉన్నారు. ఇక అనసూయకు, శివారెడ్డికి అత్యధిక ఓట్లు పోల్‌ అయినట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :