మహానుభావుడు తొలిరోజు కలెక్షన్స్ వివరాలు !

30th, September 2017 - 06:49:30 PM


మహానుభావుడు చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. పండుగ వాతావరణం కావడంతో ముఖ్యమంగా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షిస్తోంది. శర్వానంద్ హీరోగా మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 3.8 కోట్ల షేర్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. శర్వానంద్ చిత్రం ఈ స్థాయిలో వసూళ్ళని రాబట్టడం ఇదే తొలిసారి. శర్వానంద్ సరసన ఈ చిత్రం ఓ మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతాన్ని అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.