మహర్షి షూటింగ్ అప్డేట్స్ !

Published on Jan 20, 2019 10:13 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చి లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత ఫిబ్రవరిలో హైద్రాబాద్లో ఒక షెడ్యూల్ ను జరిపి తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం అబుదాబి వెళ్లి అక్కడ కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించనున్నారట దాంతో సినిమా చిత్రీకరణ పూర్తికానుంది.

ఇక ఇదిలావుంటే ఈ చిత్రం యొక్క టీజర్ ను మహాశివరాత్రి రోజు మార్చి 4న విడుదలచేయనున్నారని టాక్. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ విడుదల తేదీపై అధికారిక సమాచారం వెలుబడాల్సి వుంది.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్నిదిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం తరువాత మహేష్ , సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం జూన్ లో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :

X
More