టాక్..ఒకరోజు ముందే “మహేష్ 28” నుంచి ట్రీట్.?

టాక్..ఒకరోజు ముందే “మహేష్ 28” నుంచి ట్రీట్.?

Published on Nov 3, 2022 9:00 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది పాన్ ఇండియా సినిమా కాకపోయినా కూడా ఆ రేంజ్ అంచనాలు అయితే దీనిపై నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం రెండో షెడ్యూల్ కి సిద్ధం అవుతుండగా రీసెంట్ గానే ఈ చిత్రం నుంచి ఓ క్రేజ్య్ ట్రీట్ అయితే ఈ నెల లోనే రానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

ఈ నవంబర్ 7న చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ బర్త్ డే కాగా ఈ సందర్భంగా అయితే సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావచ్చని బజ్ ఉంది. అయితే ఈ ట్రీట్ ఒకరోజు ముందే అంటే నవంబర్ 6న సాయంత్రమే రావచ్చని లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి అయితే ఎలాంటి అప్డేట్ వస్తుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం ఇస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హారికా హాసిని వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు