కొత్త టీఆర్పీ బ్లాస్ట్ కి రెడీ అవుతున్న మహేష్, తారక్ లు.!

Published on Sep 19, 2021 9:30 am IST

ఇప్పుడు మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై మంచి క్రేజ్ తో నడుస్తున్న టాప్ మోస్ట్ గ్రాండ్ రియాలిటీ షోలు ఏవన్నా ఉన్నాయి అంటే అవి కింగ్ నాగ్ హోస్ట్ గా చేస్తున్న “బిగ్ బాస్” అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” కూడా ఒకటి. అయితే ఈ రెండు షోలు కూడా ఇప్పుడు సాలిడ్ రేటింగ్ తో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ తో దూసుకెళ్తున్నాయి.

ఇదిలా ఉండగా తారక్ షో కి అయితే అంతకంతకు రేటింగ్ గ్రాఫ్ పెరుగుతూ వెళ్తుంది కానీ తగ్గడం లేదు కానీ ఇప్పుడు ఈ టీఆర్పీ మీటర్ ను బద్దలుకొట్టాడనికి తారక్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మహేష్ తన సర్కారు వారి పాట షూట్ లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసి తారక్ తో హాట్ సీట్ లో కూర్చునేందుకు రెడీ అవుతున్నాడట. ఇక ఈ కాంబోతో ఎలా కొత్త టీఆర్పీ రేటింగ్స్ నమోదు అవుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం :