‘మహేష్ బాబు, చిరంజీవిని’ కూడా బీట్ చేసేలా కనిపిస్తున్నాడు ?

Mahesh-Babu
‘చిరంజీవి సినిమాల నుండి తప్పుకున్న తరువాత మొదటి స్థానం కోసం ‘పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ల మధ్య పోటీ జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఒకసారి పవన్ సత్తా చూపితే మరోసారి మహేష్ ముందు నిలబడేవాడు. మళ్ళీ ఇప్పుడు చిరు 150వ సినిమాతో రంగప్రవేశం చేస్తుండటంతో ఇకపై వీళ్ళు వెనక్కు తగ్గాల్సిందేనని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. ఏకంగా చిరంజీవికే గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది.

తాజాగా చిరు 150 వ సినిమా ఈస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్ సుమారు రూ. 5.5 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని వార్త వచ్చింది. దీంతో అందరూ ఇదే పెద్ద రికార్డ్ అని కూడా అన్నారు. కానీ తాజాగా మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న 23వ చిత్రం తాలూకు రైట్స్ ఈస్ట్ గోదావరిలో రూ.5.75 కోట్లకు పైగానే అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొన్నిరోజుల ఆగాల్సిందే.