‘బ్లడీ రోమియో’ కోసం హీరోయిన్ వేట.. నాని సరసన ఎవరు ఫిక్స్ అవుతారో..?

‘బ్లడీ రోమియో’ కోసం హీరోయిన్ వేట.. నాని సరసన ఎవరు ఫిక్స్ అవుతారో..?

Published on Sep 30, 2026 12:39 AM IST

‘ది ప్యారడైజ్’ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్న చిత్రం ‘బ్లడీ రోమియో’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ రెండో వారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ఓ ముఖ్య పాత్రలో నటించనుండటం ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ, ప్రియాంక మోహన్, మీనాక్షి చౌదరి, పూజా హెగ్డే పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, మేకర్స్ ఇంకా ఎవరినీ అధికారికంగా ఖరారు చేయలేదు. సుజీత్ శైలి యాక్షన్, నాని మేనరిజమ్స్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి హైప్ నెలకొంది. మరి నాని సరసన ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు ఫిక్స్ అవుతారా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు