టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రెస్టీజియ్ 100వ చిత్రం ‘కింగ్ 100’ సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఆర్.ఎ. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్, డ్రామా మరియు థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాలోని విలన్ పాత్రను ప్రకటించడంతో ప్రాజెక్ట్ మళ్లీ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
దర్శకుడు కార్తీక్‌తో గతంలో ‘నిన్నిలా నిన్నిలా’లో పనిచేసిన తమిళ నటుడు అశోక్ సెల్వన్ ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున వంటి స్టార్ హీరోతో అశోక్ సెల్వన్ ఢీకొట్టబోతుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో విలన్ పాత్ర వెల్లడి కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపైంది. నాగార్జున, అశోక్ సెల్వన్ మధ్య వచ్చే సీన్స్ ఏ స్థాయిలో ఉంటాయోనని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో టబు, ఐశ్వర్య రాజేష్, సుష్మిత భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


