క్రేజీ కాంబో సెట్ చేస్తున్న చందూ మొండేటి..?

క్రేజీ కాంబో సెట్ చేస్తున్న చందూ మొండేటి..?

Published on Sep 30, 2026 2:13 AM IST

‘తండేల్’తో నాగచైతన్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన దర్శకుడు చందూ మొండేటి ఇప్పుడు బాలీవుడ్‌లో సరికొత్త అడుగు వేయబోతున్నారట. దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘మహాకాళ్’ ద్వారా ఆయన హిందీ చిత్రసీమకు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘కార్తికేయ 2’తో చందూ క్రియేట్ చేసిన మ్యాజిక్ నచ్చి, భన్సాలీ స్వయంగా ఈ పౌరాణిక డ్రామా బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో దగ్గుబాటి రానా, బాలీవుడ్ స్టా

ర్ అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఎక్కువ భాగం వారణాసి వేదికగా జరగనుందని, భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారని సమాచారం. చందూ మొండేటి విజన్, ఐడియాస్ నచ్చడంతో కథలో కొన్ని కీలక మార్పులు కూడా చేశారట. సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో చందూ మొండేటి చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌పై ఇండియన్ సినీ వర్గాల్లో విశేషమైన అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు