వైరల్: బాలయ్య డైలాగ్ తో అదరగొట్టిన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఫుల్ ఖుషీలో నందమూరి అభిమానులు

వైరల్: బాలయ్య డైలాగ్ తో అదరగొట్టిన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఫుల్ ఖుషీలో నందమూరి అభిమానులు

Published on Sep 30, 2026 7:06 AM IST

ఇప్పుడు టాలీవుడ్ లో నందమూరి కుటుంబం తాలూకా లెగసిని ముందుకు తీసుకెళ్తున్న స్టార్స్ లో నట సింహం బాలయ్య అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లు ముందు ఉంటారు. వీరితో పాటుగా కళ్యాణ్ రామ్ కూడా హీరో గానే కాకుండా నిర్మాతగా బాధ్యతలు చేపట్టి ముందుకు వెళుతున్నారు. అయితే వీరిలో బాబాయ్ బాలయ్యతో ఉన్న అనుబంధం కోసం ఎప్పుడు అభిమానుల్లో ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది.

బాలయ్య తారక్ కోసం మాట్లాడినా తారక్ బాలయ్య కోసం మాట్లాడినా అవి అభిమానులలో ఆనందం కలిగిస్తాయి. ఇప్పుడు అభిమానులు అదే హై మూమెంట్ లో ఉన్నారు. నిన్న డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఈవెంట్ లో బాలయ్య డైలాగ్ తో తారక్ ఫుల్ జోష్ నింపారు. దీనితో ఈ క్లిప్ ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇలా ఈవెంట్ లో సాలిడ్ ఎలిమెంట్స్ తారక్ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు