వెరీ స్పెషల్ : టాలీవుడ్ మోస్ట్ ఈగోలెస్ హీరో మహేష్..!

Published on Feb 27, 2022 9:04 pm IST

ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అయినా కూడా ఓ హీరో కోసం మరో హీరో మాట్లాడ్డం అనేది ఎప్పుడూ కాస్త సంథింగ్ స్పెషల్ గానే ఉంటుందని చెప్పాలి. అయితే తమ స్టార్డం ని పక్కన పెట్టి నేనే అనే ఈగో లేకుండా మరో హీరోల సినిమాల కోసం మాట్లాడగలిగే హీరోలు చాలా తక్కువ మందే ఉంటే ఆ తక్కువ మందిలో డెఫినెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఉంటారని చెప్పాలి.

తనతో పాటు ఇండస్ట్రీలో సమన క్రేజ్ ఉన్న తోటి హీరోల సినిమాలు అయినా మరే ఇతర సినిమాల కోసం గాని చెప్పిన సందర్భాలు అనేకం అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన మన స్టార్ హీరోల అన్ని సినిమాలకు కూడా మహేష్ తన స్పందనను తెలియజేస్తూ రావడం అంతకంతకూ వెరీ స్పెషల్ గా మారుతూ వస్తున్నాడని చెప్పాలి.

మరి రీసెంట్ గా అయితే పవన్ నటించిన భీమ్లా నాయక్ కి తన స్పందన తెలియజేయడం మరింత ఆసక్తిగా మారింది. దీనితో మహేష్ ఫ్యాన్స్ సహా ఇతర హీరోల అభిమానుల్లో తన కోసం ఎప్పటికప్పుడు తన కోసం ఈ చర్చ నడుస్తుంది. ఇలా ఓ స్టార్ హీరో నుంచి ఎలాంటి ఈగో లేకుండా ఇలాంటి గెస్చర్ అనేది వెరీ స్పెషలే మరి.

సంబంధిత సమాచారం :