అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టిన మహేష్ !
Published on Apr 13, 2017 8:40 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టారు. మురుగదాస్ కాంబినేషన్లో ఆయన నటిస్తున్న ‘స్పైడర్’ ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం విడుదలైంది. దాంతో పాటే మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర టీమ్. ముందు నుండి ఊహించినట్టుగానే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లకు భారీ స్పందన లభించింది. అభిమానులు ఫస్ట్ లుక్ విడుదలైన కాసేపటికే దాన్ని వరల్డ్ వైడ్ ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మోషన్ పోస్టర్ రికార్డ్ స్థాయి వ్యూస్, లైక్స్ ను సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో సుమారు 6. 95 లక్షల వ్యూస్, 42 వేల లైక్స్ సొంత చేసుకున్న ఈ మోషన్ పోస్టర్ సౌత్ ఇండియాలోనే సెకండ్ మోస్ట్ లైక్డ్ మోషన్ పోస్టర్ గా నిలిచి ఇంకొద్ది సమయంలోనే మొదటి స్థాన్నాన్ని అందుకునే దిశగా వెళుతోంది. ఇకపోతే మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్,రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమాని జూన్ 23న రిలీజ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

 
Like us on Facebook