మాస్ లో స్టైల్ లో మిక్స్ చేసిన మహేష్..అదే సీన్ లుక్స్ వైరల్!

Published on Sep 9, 2021 5:01 pm IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సాలిడ్ ఎంటర్టైనర్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ షెడ్యూల్ ని కూడా అదిరే యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేసిన మహేష్ ను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కలవడం ఆసక్తిగా మారింది.

మరి ఇది ఒకెత్తు అయితే ఈ షూటింగ్ స్పాట్ లో మహేష్ కనిపించిన లుక్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇది వరకే సర్కారు వారి బ్లాస్టర్ లో తన మాస్ అండ్ స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టిన మహేష్ ఈ షూట్ లో కూడా అదే లుక్ లో కనిపిస్తున్నారు. చెవికి పోగు, మెడ మీద టాటూ వంటివి మాస్ గా అనిపిస్తుండగా వాటికి తన డ్రెస్సింగ్ తో స్టైల్ ని మిక్స్ చేసి కనిపిస్తున్నారు మహేష్..

అయితే ఈ సీన్ లో మహేష్ డ్రెస్సింగ్ చూస్తే సేమ్ దుబాయ్ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ లోది లానే ఉంది. దీనితో ఈ లుక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందేమో అన్నది కూడా వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :