విదేశాలకు బయలుదేరిన మహేష్ బాబు !


సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘స్పైడర్’చిత్రీకరణ ఆఖరి ఘట్టంలో ఉన్న సంగతి తెలిసిందే. టాకీ పార్ట్ తో పాటు అన్ని పాటలు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా చివరి పాటను కూడా త్వరలోనే ముగించుకోనుంది. ఈ పాట షూటింగ్ కోసం మహేష్ బాబు యూరప్ దేశమైన రొమానియాకు బయలుదేరి వెళ్లారు. రొమాంటిక్ డ్యూయెట్ గా ఉండనున్న ఈ సాంగ్లో మహేష్ తో రకుల్ ప్రీత్ సింగ్ ఆడపాడనుంది.

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. అని ఏరియాల్లోను భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంతో మహేష్ తమిళంలో అధికారికంగా లాంచ్ కానున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 9న చెన్నైలో భారీ లాంచింగ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.