మహేష్ రెండో దర్శకుడు మోస్ట్లీ అతడే అట మరి.!

Published on May 9, 2021 8:06 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ నటిస్తున్న “సర్కారు వారి పాట” బాలన్స్ షూట్ త్వరలోనే మొదలు కానుంది. ఇక దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ కూడా మొదలు కానుండడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ రెండు సినిమాలు కాకుండా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో చెయ్యబోయే ప్రాజెక్ట్ కంటే ముందు రెండు చిత్రాలు చేస్తారని టాక్ ఉంది. మరి అందులో ఒకటి త్రివిక్రమ్ తో ఫిక్స్ అయ్యింది. మరి ఆ రెండో దర్శకుడు ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యిపోయినట్టు తెలుస్తుంది.

అతడే హిట్ దర్శకుడు అనీల్ రావిపూడి. మహేష్ తో లాస్ట్ టైం సరిలేరు నీకెవ్వరు అనే భారీ బ్లాక్ బస్టర్ తీసిన ఈ దర్శకుడు మహేష్ తో 29వ సినిమా తీయడం కన్ఫర్మ్ అన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మహేష్ త్రివిక్రమ్ సినిమాకు కూడా ఏకకాలంలో నటించనున్నారని మరో టాక్.

సంబంధిత సమాచారం :