హాట్ టాపిక్‌గా మారిన మహేష్ సినిమాటోగ్రాఫర్!
Published on Dec 12, 2016 6:04 pm IST

ravi-chandran
హిందీ, తమిళ, మళయాల సినీ పరిశ్రమల్లో పలు బ్లాక్‌‌బస్టర్ సినిమాలకు డీఓపీ (డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ -సినిమాటోగ్రాఫర్)గా పనిచేసిన రవి.కే.చంద్రన త్వరలోనే మహేష్‌ సినిమాకు పనిచేయనున్న విషయం తెలిసిందే. మహేష్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాకు రవి పనిచేస్తారు. ఇక ఇదిలా ఉంటే నేడు రవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ‘ఓకే జాను’ అనే హిందీ సినిమా ట్రైలర్ ఈ ఉదయం విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ ట్రైలర్ చూసిన వారంతా రవి.కే.చంద్రన్ పనితనానికి కూడా పూర్తి స్థాయిలో మార్కులు వేస్తున్నారు. ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం తెరకెక్కించిన ఓకే కన్మణి (తెలుగులో ఓకే బంగారం)కి రీమేకే ఈ ఓకే జాను. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్‌తో మణిరత్నం చేసిన ఈ మ్యాజిక్, హిందీలో రీమేక్ అవుతుందనగానే అంతా పెదవి విరిచారు. మణిరత్నం క్లాసిక్ మేకింగ్‌ను అందుకోలేరన్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం ఈ వ్యాఖ్యలకు భిన్నంగా, ఆకట్టుకునేలా ఉండి దూసుకుపోతోంది. కరణ్ జోహర్, మణిరత్నం కలిసి నిర్మించిన ఈ సినిమాకు షాద్ అలి దర్శకత్వం వహించారు. ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.

‘ఓకే జాను’ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 
Like us on Facebook