సెన్సార్ పనులు ముగించుకున్న ‘మహానుభావుడు’ !

20th, September 2017 - 06:12:12 PM


ఈ దసరా బరిలో నిలవనున్న చిత్రాల్లో శర్వానంద్ చేసిన ‘మహానుభావుడు’ కూడా ఒకటి. మారుతి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. అన్ని పనులని పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ ప్రాసెస్ లో సినిమాకు ఒక్క కట్ కూడా పడకపోవడం విశేషం.

‘జై లవ కుశ, స్పైడర్’ చిత్రాలు విడుదల తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా వెంటనే రిలీజవుతుండటంతో ఈ చిత్రంపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. అంతేగాక ట్రైలర్, పాటలు కూడా బాగా జనాల్లోకి వెళ్లిపోవడం సినిమాకు కలిసొచ్చే అంశంగా మారింది. అతి శుభ్రత ఆనే లక్షణం కలిగిన యువకుడి జీవితం ఎలా ఉంటుంది, అందులోకి అమ్మాయి ప్రవేశిస్తే ఎలాంటి మలుపులు తీసుకుంది, అతి శుభ్రత మూలాన హీరో, అతని దగ్గరి వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే అంశాల్ని ఎంటర్టైనింగా ఈ చిత్రంలో చూపామని చిత్ర యూనిట్ తెలిపారు.