రీ రిలీజ్ కి రెడీ అయిన రామ్ పోతినేని “రెడీ”?

Published on May 3, 2023 8:52 pm IST


టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ఉన్న ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. ఈ ఎనర్జిటిక్ హీరో ప్రస్తుతం మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక పవర్ ఫుల్ చిత్రాన్ని చేస్తున్నారు. అయితే రామ్ కెరీర్ లో ప్రత్యేక హిట్ గా నిలిచిన రెడీ సినిమా ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

హీరో రామ్ పోతినేని పుట్టిన రోజు (మే 15) సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహించగా, రాక్ స్టార్ డిఎస్పీ సంగీతం అందించారు. ఈ చిత్రం లో రామ్ సరసన హీరోయిన్ గా జెనీలియా నటించింది.

సంబంధిత సమాచారం :