ఆసక్తిగా “మళ్ళీ పెళ్లి” ట్రైలర్.!

Published on May 11, 2023 12:01 pm IST

సీనియర్ నటుడు నరేష్ నటించిన లేటెస్ట్ చిత్రం “మళ్ళీ పెళ్లి” కోసం ఆల్ మోస్ట్ చాలా మందికి తెలిసిందే. మరి నటి పవిత్ర లోకేష్ తో కలిసి చేస్తున్న ఈ సినిమాని మేకర్స్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియెన్స్ లోకి తీసుకెళ్లారు. ఇక దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు ఫైనల్ గా ట్రైలర్ ని అయితే రిలీజ్ చేసారు.

మరి ఈ ట్రైలర్ అయితే గతంలో వచ్చిన వీడియోలు టీజర్ తో పోలిస్తే కాస్త సీరియస్ గా ఉందని చెప్పాలి. నరేష్ పాత్ర ఈ సినిమాలో కూడా ఓ నటుడుగా కనిపిస్తుండగా అతని లైఫ్ లో కూడా ముగ్గురు భార్యలు అంటూ లోకేష్ వచ్చాక ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అనే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.

అయితే ఈ ట్రైలర్ లో మాత్రం గతంలో పోలిస్తే రొమాంటిక్ యాంగిల్ సీన్స్ తగ్గించి కాస్త సీరియస్ సీన్స్ తో కొంచెం బోల్డ్ గా కూడా ఈ ట్రైలర్ కనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో సురేష్ బొబ్బిలి ఇచ్చిన సంగీతం కూడా బాగుంది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. అప్పుడు చూడాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :