అందుకే రాజీనామాలను ఆమోదించాము – మంచు విష్ణు

Published on Dec 12, 2021 3:48 pm IST

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ‘మా’ఎన్నికల్లో గెలుపొందిన 11 మంది రాజీనామాలను ఆమోదించారు. ఈ 11 మంది ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ తరపున గెలుపొందారు. అయితే, ఈ నిర్ణయం పై మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘రాజీనామాలు చేయొద్దని మేము కోరాము. అయితే, వాళ్ళు వెనక్కి తీసుకోలేదు. వాళ్లు అంగీకరించకపోవడం కారణంగానే.. మేము రాజీనామాలను ఆమోదించాము’ అని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు.

అయితే ‘మా’ సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్‌ రాజ్‌ చేసిన రాజీనామాలను ఆమోదించలేదని చెప్పుకొచ్చారు. ఇక ‘మా’ బిల్డింగ్‌ పై చర్చలు జరుగుతున్నాయని.. వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలుపొంది, రాజీనామా చేసిన సభ్యులు వీరే

జాయింట్‌ సెక్రటరీ: ఉత్తేజ్‌
వైస్‌ ప్రెసిడెంట్‌: బెనర్జీ
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌

ఈసీ మెంబర్స్‌
బ్రహ్మాజీ
శివారెడ్డి
సుడిగాలి సుధీర్‌
ప్రభాకర్‌
తనీష్‌
కౌశిక్‌
సురేశ్‌ కొండేటి
సమీర్‌

సంబంధిత సమాచారం :