ఓటిటి సమీక్ష : “మాన్షన్ 24” – తెలుగు సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం

ఓటిటి సమీక్ష : “మాన్షన్ 24” – తెలుగు సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం

Published on Oct 17, 2023 5:01 PM IST
Mansion 24 Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 17, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, సత్య రాజ్, అవికా గోర్, బిందు మాధవి, అర్చన జోయిస్, అమర్‌దీప్, మానస్, అభినయ, నందు, అయ్యప్ప శర్మ, రాజీవ్ కనకాల, జయప్రకాష్ మరియు ఇతరులు

దర్శకుడు : ఓంకార్

నిర్మాతలు: ఓంకార్, అశ్విన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి

సంగీతం: వికాస్ బాదిసా

సినిమాటోగ్రఫీ: బి. రాజశేఖర్

ఎడిటర్: ఆది నారాయణ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

రీసెంట్ గా మన తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో మంచి ఆసక్తి రేపిన లేటెస్ట్ వెబ్ సిరీస్ లలో “మాన్షన్ 24” కూడా ఒకటి. మరి దర్శకుడు ఓంకార్ మొట్టమొదటి సారిగా ఓటిటి లో చేసిన మొదటి సిరీస్ కాగా టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలో నటించింది. మరి ఈరోజు నుంచే డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ ఎలా సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..అమృత(వరలక్ష్మి శరత్ కుమార్) ఓ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కాగా ఆమె తండ్రి కాళిదాసు(సత్యరాజ్) పురావస్తు శాఖ(ఆర్కియాలజీ) డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు అయితే తాను ఓ మిస్ అవుతాడు. మరి ఈ క్రమంలో అమృతకి ఈ విషయంలో తెలియగా ఈ అంశాన్ని తాను ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు తన తండ్రి ఓ పాడుబడ్డ మాన్షన్ కి చివరిసారిగా వెళ్లినట్టు తెలుసుకుంటుంది. మరి అక్కడకి తన తండ్రి ఎందుకు వెళ్ళాడు? ఆ మాన్షన్ వెనుక ఉన్న హిస్టరీ ఏంటి? అందులో అసలు ఏం జరుగుతుంది? చివరికి అమృత తన తండ్రి ఆచూకీ కనుగొంటుందా లేదా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ హారర్ బ్యాక్ డ్రాప్ లో అయినప్పటికీ కొందరి నటీనటుల విషయంలో కొన్ని సబ్ ప్లాట్ లు కూడా ఉంటాయి. అయితే వీటిలో కొంచెం ఇంప్రెసివ్ గా కేజీయప్ నటి అర్చన జోయిస్ ,మరియు నందు ల కథ బాగుంటుంది. అందులో అంత కొత్తదనం లేకపోయినప్పటికీ దర్శకుడు దానిని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. అలాగే ఈ సిరీస్ లో మరింత ఆసక్తిగా అనిపించిన అంశం ఈ సిరీస్ అట్మాస్పియర్ అని చెప్పాలి.

ఒక హారర్ థ్రిల్లర్ కి కావాల్సిన వాతావరణాన్ని అయితే మేకర్స్ సెటప్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. అలాగే నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పటిలానే ఇంటెన్స్ పెర్ఫామెన్స్ కనబరిచారు. అలాగే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన అవికా గోర్, బిందు మాధవి సహా రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ లో బాగా డిజప్పాయింట్ చేసే అంశాల్లో స్టార్టింగ్ వచ్చే కొన్ని ప్లాట్ లు అంత ఎంగేజింగ్ గా ఏమి సాగవు. పైగా ఓ హిందీ సిరీస్ డర్ నా మానా హై సిరీస్ ఈ సిరీస్ లో కనిపిస్తుంది. దీనితో అంత కొత్తదనం ఈ సిరీస్ లో కనిపించదు. అలాగే అవికా గోర్ పై నడిచే కథనం ఏమంత ఇంప్రెసివ్ గా అనిపించదు. అలాగే ఇక మంచి హారర్ ఎలిమెంట్స్ కావాలని సిరీస్ చూస్తే ఆ జానర్ ఆడియెన్స్ అయితే కాస్త డిజప్పాయింట్ కావచ్చు.

అలాగే మరో డిజప్పాయింటింగ్ అంశం ఏమిటంటే సత్యరాజ్, రావు రమేష్ లాంటి వెర్సటైల్ నటుల్ని పెట్టుకొని చాలా సింపుల్ గా ప్రెజెంట్ చేసి ముగించేశారు. వారి పాత్రలని ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేస్తే ఇంపాక్ట్ బాగుండేది. అలాగే ఎమోషన్స్ కూడా అంత వర్క్ అవ్వలేదు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అంత ఇంప్రెస్ చేయదు. దీనితో ఈ సిరీస్ ముగింపే అంత గొప్ప ముగింపులా అనిపించదు. వీటితో అయితే ఈ సిరీస్ అనుకున్న రేంజ్ లో మెప్పించదు.

 

సాంకేతిక వర్గం :

 

మొదట చెప్పినట్టుగానే సిరీస్ లో నిర్మాణ విలువలు అయితే సాలిడ్ లెవెల్లో ఉన్నాయి. సిరీస్ లో కథాంశంకి బాగా సెట్ అయ్యింది ఏదన్నా ఉంది అంటే ఆ ఖర్చుకి తగ్గ టెక్నీకల్ అవుట్ పుట్ అని చెప్పాలి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్ గా ఉంది. ఇంకా గ్రాఫిక్స్ విజువల్స్ ని ఇంకా నాచురల్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు ఓంకార్ విషయానికి వస్తే..తాను ఇదివరకే హారర్ థ్రిల్లర్స్ ని హ్యాండిల్ చేయడంలో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఈ మాన్షన్ 24 విషయంలో మాత్రం తడబడ్డారు అని చెప్పక తప్పదు. కేవలం కొన్ని అంశాలు తప్ప ఇక సిరీస్ అంతా కూడా చాలా సో సో గానే అనిపిస్తుంది. సిరీస్ ని హారర్ తో ప్రెజెంట్ చేసి మరో కోణాలు చూపించడం ఆ జానర్ లవర్స్ కి బాగా డిజప్పాయింట్ చేసాడు. అలాగే ఎండింగ్ కూడా అంత ఆకట్టుకునేలా లేదు. వీటితో మాత్రం ఓంకార్ నుంచి ఇది ఒక వీక్ వర్క్ అని చెప్పక తప్పదు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మాన్షన్ 24” ఒక హారర్ థ్రిల్లర్ గా వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో ఇది ఆకట్టుకోదు అని చెప్పాలి. అసలు సిరీస్ లో మెయిన్ పాయింట్ నే కాస్త వీక్ గా అనిపిస్తుంది. దీనితో ఈ సిరీస్ అంతా కూడా చాలా రొటీన్ అండ్ ఊహించిన దానికన్నా తక్కువ రేంజ్ లోనే అనిపిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, సిరీస్ లో గ్రాండియర్ జస్ట్ కొన్ని అంశాలు వరకు మాత్రమే ఇది మెప్పిస్తుంది. సో టోటల్ గా వీటి అన్నిటితో ఈ వారాంతానికి ఈ సిరీస్ ఒక బోరింగ్ ట్రీట్ లా మిగిలిపోయింది అని చెప్పాలి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు