శంకర్ – చరణ్ ల మాసివ్ ప్రాజెక్ట్ కి ఈ మాస్ టైటిల్ ఫిక్సేనట..!

Published on Jun 5, 2022 3:46 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ మరింత పెంచుకుంటూ వెళ్తున్నాడు. లేటెస్ట్ గా అయితే భారీ సినిమా RRR తో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో ఇండియాస్ టాప్ దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్నాడు. దీనితో ఈ సినిమాపై కూడా ఓ రేంజ్ లో హైప్ ఉండగా దీని కోసం పాన్ ఇండియా వీక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంకి టైటిల్ ఏం పెట్టారు అనే దానిపై గత కొన్ని రోజులు కితం ఇంట్రెస్టింగ్ బజ్ బయటకి వచ్చింది. ఇప్పుడు అదే నిజం అయ్యేలా ఉందని తెలుస్తుంది. తెలుగులో ఈ సినిమాకి మాస్ టైటిల్ “సర్కారోడు” అనే పేరునే ఫిక్స్ చేసినట్టుగా ఇప్పుడు లేటెస్ట్ గా బయటకొచ్చిన టాక్. అలాగే దీనిపై అయితే అనుకున్నట్టు గానే ఆగస్ట్ లో క్లారిటీ రానుందట. మరి దీనిపై క్లారిటీ తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :