మల్టీ స్టారర్ సినిమా అంగీకరించిన మెగా హీరో !
Published on Nov 11, 2017 6:13 pm IST

రాజా ది గ్రేట్ సినిమా తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాలో వెంకటేష్ నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. తాజా సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి మరో హీరో ఓకే చెప్పినట్లు సమాచారం.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ వెంకటేష్ తో నటించడానికి అంగీకరించాడాని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ కు సాయి అయితే బాగుంటాడని భావించిన డైరెక్టర్ అతన్ని కలవడం కథ వినిపించడం జరిగిపోయాయి. గతంలో సాయి ధరమ్ తేజ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సుప్రీమ్ సినిమా మంచి విజయం సాధించింది. త్వరలో ప్రారంభం అయ్యే ఈ మల్టీ స్టారర్ సినిమా గురించి మరింత సమాచారం తెలియనుంది. ఈ మల్టీస్టారర్ సినిమా విజయవంతం అయ్యి ఇలాంటి మరెన్నో మల్టీ స్టారర్ సినిమాలు తెలుగులో రావాలని కోరుకుందాం.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook