ఇష్టమైన రోల్ కోసం కష్టపడుతున్న మెగాహీరో

Published on Mar 24, 2020 10:46 am IST

మెగాస్టార్ అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఒక సినిమాను ముగించే పనిలో ఉన్న ఆయన ఇంకో రెండు కొత్త చిత్రాలకు ఓకే చెప్పారట. వాటిలో ఒకటి స్పోర్ట్స్ డ్రామా కాగా ఇంకొకటి రొమాంటిక్ ఎంటెర్టైనర్. వీటిలో రొమాంటిక్ లవ్ స్టొరీని శ్రీధర్ సీపాన డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా కథ పట్ల వైష్ణవ్ తేజ్ చాలా ఇంప్రెస్ అయ్యారు.

అందుకే కథలో మరింత ఆకర్షణీయంగా కనబడటం కోసం లుక్ మార్చుకుంటున్నాడట. ఇప్పటికే బరువు తగ్గే వర్కవుట్స్ మొదలుపెట్టాడట. అందుకోసం ఆర్గానిక్ థెరపీకి కూడా వెళ్లినట్టు సమాచారం. కరోనా లాక్ డౌన్ పీరియడ్ ముగియగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇందులో దేవ్ సరసన అవికా ఘోర్ కథానాయకిగా నటిస్తుందని తెలుస్తోంది. ఇకపోతే పులి వాసు దర్శకత్వంలో అభిషేక్ ఆగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీల సంయుక్త నిర్మాణంలో దేవ్ చేస్తున్న ‘సూపర్ మచ్చి’ చిత్రం చివరి దశ పనుల్లో ఉంది.

సంబంధిత సమాచారం :

X
More