అక్కినేని హీరో కోసం మెగా హీరో తప్పుకోబోతున్నాడా?

Published on Sep 24, 2021 2:24 am IST


కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో ప్రతి వారం ఒక్కొక్కటిగా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అక్టోబర్ 8న కూడా టాలీవుడ్‌లో రెండు మీడియం రేంజ్ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇందులో మొదటిది అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కాగా, రెండోది మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం.

అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా కోసం కొండపొలం మూవీని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. “ఉప్పెన” సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండపొలం. ఈ సినిమాను దసరా బరి నుంచి తప్పించి నవంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే కేవలం అఖిల్ సినిమా కోసమే మెగాహీరో సినిమా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :