అఖిల్ కు మెగా హీరోల సపోర్ట్ !

20th, December 2017 - 09:07:06 AM

అక్కినేని అఖిల్ రీ లాంచ్ చిత్రం ‘హలో’ ఈ నెల 22న రిలీజ్ కానుంది. విడుదలకు ఇంకో రెండు రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ల వేగం పెంచారు చిత్ర టీమ్. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి వస్తారని నాగార్జున ప్రకటించగా ఇప్పుడు ఆయనతో పాటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా వస్తారని అఖిల్ ప్రకటించారు.

ఇలా ఇద్దరు మెగా స్టార్ హీరోలు అఖిల్ కోసం వస్తుండటంతో అందరిలోను చిత్రం పట్ల ప్రత్యేక ఆసక్తి నెలకొంది. నాగార్జున కుడా ఈ చిత్రమే అఖిల్ కు సరైన లాంచ్ అని అభిప్రాయపడుతుండగా అఖిల్ కూడా ఈ దఫా విజయం అందుకొని తీరాలనే దృఢ నిశ్చయంతో శ్రమించి సినిమా చేశారు. విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే హిట్ గా నిలవగా సినిమా కూడా పాటల్లానే అందంగా ఉంటుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంతో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ పరిచయం కానుంది