అశోక్ గల్లా “హీరో” కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్!

Published on Jan 12, 2022 2:30 pm IST


అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతూ, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ను అమర రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటల కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదల అయిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం గా చేస్తుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ చిత్రం ప్రి రిలీజ్ వేడుక రేపు జరగనుంది. జనవరి 15 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందొ చూడాలి.

సంబంధిత సమాచారం :