తన రిటైర్మెంట్ పై చిరు స్ఫూర్తిదాయక, సాలిడ్ స్టేట్మెంట్.!

తన రిటైర్మెంట్ పై చిరు స్ఫూర్తిదాయక, సాలిడ్ స్టేట్మెంట్.!

Published on Dec 28, 2022 9:35 PM IST

ఇప్పుడు మన టాలీవుడ్ సీనియర్ హీరోలు అంతా కూడా ఇపుడు తమ వయసుని మించి తమ డెడికేషన్ తో తమ ఫ్యాన్స్ ని అలరించేందుకు ఎంతవరకు అయినా కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు కాగా తనకి లేటెస్ట్ గా ఎదురైన రిటైర్మెంట్ ప్రశ్నపై తాను ఇచ్చిన సమాధానం మాత్రం రాబోయే ఇప్పుడున్న నటులకి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చెప్పొచ్చు.

తాను నటించడం కోసమే ఇండస్ట్రీ లోకి వచ్చాను కెమెరా ముందు ఉన్నంతవరకు నటుడుగా ఎంతవరకు వెళ్ళడానికి అయినా నేను సిద్ధమే అని ఆ షూట్ అయ్యాక నా బాధలు నేను పడతాను కానీ ప్రేక్షకులని నా అభిమానులని అలరించడానికి మాత్రం షూటింగ్ లో ఎంత బాధని అయినా భరిస్తానని దానిని బయటకి మాత్రం వ్యక్తం చేయనని చెప్పారు.

అలాగే తాను ఇలా సినిమాలలో నటించలేకపోతున్నాను అని అనిపిస్తే ఆ రోజున సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. కానీ ఆ రోజు ఒక నటుడు జీవితంలో ఎప్పుడూ ఉండకూడదు అని ఇక్కడకి కష్టపడడానికి వచ్చాము ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా నిలబడిగలిగే వారే ఉన్నత స్థాయిలోకి వస్తారు అని అలా కాదు అనుకుంటే గెట్ లాస్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ వారు వెళ్లిపోవచ్చు అని చిరు తెలిపారు. ఈ సాలిడ్ కామెంట్స్ మాత్రం ఇండస్ట్రీ లోకి రావాలి అనుకునే వారికి మరింత స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు