మెగాస్టార్ “ఆచార్య” థియేట్రికల్ ట్రైలర్ రన్‌టైమ్ లాక్డ్

Published on Apr 12, 2022 12:26 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29, 2022న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 05:49 విడుదల కి సిద్ధంగా ఉంది.

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ట్రైలర్ రన్ టైమ్ 2 నిమిషాల 35 సెకన్లు. ట్రయిలర్ చాలా బాగా వచ్చిందని, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారని బజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 150 కి పైగా థియేటర్లలో ఈరోజు ట్రైలర్ కూడా విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించాయి.

సంబంధిత సమాచారం :