100 రోజులు పూర్తి చేసుకున్న మెగాస్టార్ ‘ఖైదీ నెం 150’ !
Published on Apr 20, 2017 9:03 am IST


మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ళ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ వివి. వినాయక్ దర్సకతవరంలో చేసిన చిత్రం ‘ఖైదీ నెం 150’. ఈ చిత్రం ఆరంభం రోజు నుండే భారీ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ కలెక్షన్లను వసూలు నాన్- బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసింది. కొన్ని ఏరియాల్లో అయితే బాహుబలి రికార్డుల్ని దాదాపు టచ్ చేసింది కూడా. ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం నిన్నటితో శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు.

దీంతో మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వేడుకలు నిర్వహించారు. దీంతో చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ రీ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ కావడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులు కూడా సంబరపడుతున్నారు. చిత్ర నిర్మాత రామ్ చరణ్ అయితే ‘మీ మెగాస్టార్ తో 100 రోజుల జర్నీ చేయడం ఆనందంగా ఉంది. ఈ పాజిటివ్ ఎనర్జీతోనే నాన్నతో మరో ప్రాజెక్ట్ చేయడానికి సిద్దమవుతున్నాను’ అన్నారు.

 
Like us on Facebook