మొదలైన మెగాస్టార్ ‘సైరా’ షూటింగ్ !
Published on Dec 6, 2017 8:30 am IST

మెగా అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ కొద్దిసేపటి క్రితమే మొదలైంది. హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవిపై మొదటి షాట్ ను చిత్రీకరిస్తున్నారు. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.

తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా అమితాబ్ బచ్చన్, సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి వంటి స్టార్ నటీనటులు ఇందులో నటించనున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ చేయనున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడెవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.

 
Like us on Facebook